రాజు కుమారుడు మంత్రి కుమారుడు గురుకులమునుండి వచ్చి దేశాటనకు బయలుదేరతారు. వేరే రాజ్యం లోని అడవిలో ఒక రాత్రి సమయంలొ చెట్టుక్రింద ఇద్దరు నిద్దురపోతుండగ చెట్టుపై పక్షులు "రేపు వుదయం ఇక్కడి కొనేటికి రాజకుమార్తె వస్తుంది. ఆమె సౌందర్యానికి ముగ్దుడై రాజు కుమారుడు దగ్గరగాచూడాలని పొదలచాటుకు వెళ్ళగా ఒక సర్పం కాటువెయడంవలన మరణిస్తాడు" అని మాటలాడుకుంటువుంటాయి. పక్షుల భాష తెలిసిన మంత్రి కుమారుడుకి మెలకువ రావడంవల్ల ఆ మాటలు వింటాడు. మంత్రి కుమారుడు తమ మాటలు వింటున్న సంగతి గమనించి, ఈ విషయం అతడు ఎవరికైన చెబితె మరణిస్తాడని చెప్పి పక్షులు ఎగిరిపోతాయి. మంత్రి కుమారుడుకి ఎమి చేయాలో అర్దం కాదు. రాత్రంతా నిద్దుర పట్టదు. తెల్లవారుతుంది, రాజ కుమర్తె వస్తుంది, రాజకుమారుడు పొదవద్దకు వెళ్ళతాడు, సర్పం కాటువేస్తుంది, మరణిస్తాడు.ఇది నేను ఎలిమెంటరి స్కూల్లో విన్న కధ. రాజు కుమారుడు మరణిస్తాడని ముందుగానె తెలిసి ఎమి ప్రయోజనం. ఇక మంత్రి కుమారుడు విద్యకు ఫలితమేమిటి.


No comments:
Post a Comment