Monday, January 14, 2008

My oppertunity


నేనెప్పుడు విదేశాలు వెళ్ళాలనుకోలేదు.
అసలు నాచదువే అంతంతమాత్రం.
ఫోటోగ్రఫిలో స్కిల్స్మాత్రం అమోఘం.
నన్ను వెతుక్కుంటూ విదేశి కంపనిలో వుద్యోగం వచ్చింది.
తర్జన భర్జన పడుతూనె 22 february 2006 స్వదేశం విడిచాను.
ముందు ఒప్పుకున్నా
తరువాత వెళ్ళనంటె
నాకు నష్టం వచేస్తుంది
ఖచ్చితంగా రావాలంటూ తీసుకువెళ్ళాడు.
కర్చులన్ని నెనే పెట్టుకుంటాను
టికెట్ కోసం ఒక రూ.40,000/- ఇమ్మంటె ఇచ్చాను.

అక్కడ కంపని లేదు.
పనిలేదు.
పేపర్స్ లేవు.
నేను వెళ్ళిపొతానంటె
22 ఎప్రిల్ 2006 కి పంపిస్తానన్నాడు

తరువాత వేరే వాడిని తెచ్చుకుంటున్నాను
ఒక్క నెల ఎక్ష్టన్సన్ పై వుండమన్నాడు.

నాలుగవ నెలలో ఒక వారంలొ వస్తా అని
ఇంకొ నాలుగు నెలలైనా రాలేదు.

నా టికెట్ అతని దగ్గరే పెట్టుకున్నాడు.
అతని కజిన్ దగ్గర నన్నుపెట్టాడు.

ఎన్నో వింత పరిణామాల తరువాత
15 నవంబరు 2006న తిరుగు ప్రయణమైయాను.
8 నెలల బ్రేక్ 2 సంవత్సరాలుగ ప్రభావం చూపుతూవుంది.

Thursday, January 10, 2008

National Conference On Oil Palm


Interested visit http://nationalconferenceonoilpalm.blogspot.com

Saturday, January 5, 2008

మీరు ఇది చూసార

ప్రజాకళలో గాలి రాగమైన ఆకుల లయ

Friday, January 4, 2008

విధిని యవ్వరు యేవిధంగాను తప్పించుకొలేరు

తరువాత ఎం జరిగిందంటె. శాపవశాత్తు సర్పముగా మారిన ఒక యక్షిణి మంత్రి కుమారుడుచే చంపబడి శాపవిమోచనం పొంది రాజుకుమారుని తిరిగి బ్రదికిస్తుంది. తటాకానికి వచ్చిన ఆ దేశపు రాకుమరి రాకుమారుడిని చూసి ఇష్టపడుతుంది. దేశాటన ముగుస్తుంది రాజకుమరుడు, రాకుమారి ఇద్దరి తల్లిదండ్రులు వారికి వివాహం చేస్తారు. మంత్రి కుమారునికి కూడా వివాహమవుతుంది. రాజుకుమారుడు రాజవుతాడు, మంత్రి కుమారుడు మంత్రి అవుతాడు, రాజ్యాన్ని సురక్షితంగ సుభిక్షంగ పరిపాలిస్తారు.

Thursday, January 3, 2008

భవిష్యవాణి

రాజు కుమారుడు మంత్రి కుమారుడు గురుకులమునుండి వచ్చి దేశాటనకు బయలుదేరతారు. వేరే రాజ్యం లోని అడవిలో ఒక రాత్రి సమయంలొ చెట్టుక్రింద ఇద్దరు నిద్దురపోతుండగ చెట్టుపై పక్షులు "రేపు వుదయం ఇక్కడి కొనేటికి రాజకుమార్తె వస్తుంది. ఆమె సౌందర్యానికి ముగ్దుడై రాజు కుమారుడు దగ్గరగాచూడాలని పొదలచాటుకు వెళ్ళగా ఒక సర్పం కాటువెయడంవలన మరణిస్తాడు" అని మాటలాడుకుంటువుంటాయి. పక్షుల భాష తెలిసిన మంత్రి కుమారుడుకి మెలకువ రావడంవల్ల ఆ మాటలు వింటాడు. మంత్రి కుమారుడు తమ మాటలు వింటున్న సంగతి గమనించి, ఈ విషయం అతడు ఎవరికైన చెబితె మరణిస్తాడని చెప్పి పక్షులు ఎగిరిపోతాయి. మంత్రి కుమారుడుకి ఎమి చేయాలో అర్దం కాదు. రాత్రంతా నిద్దుర పట్టదు. తెల్లవారుతుంది, రాజ కుమర్తె వస్తుంది, రాజకుమారుడు పొదవద్దకు వెళ్ళతాడు, సర్పం కాటువేస్తుంది, మరణిస్తాడు.

ఇది నేను ఎలిమెంటరి స్కూల్లో విన్న కధ. రాజు కుమారుడు మరణిస్తాడని ముందుగానె తెలిసి ఎమి ప్రయోజనం. ఇక మంత్రి కుమారుడు విద్యకు ఫలితమేమిటి.

Tuesday, January 1, 2008

బ్లాగుల్ని ఏరుకుంటూ...

1999-2001 మధ్య లో బ్లాగు క్రియేట్ చేసాను. విజిటర్స్ లేకపోవటం, నాతో పాటే అప్పుడప్పుడె కుదురుకుంటున్న ఈ రంగం లోని అనిశ్చిత పరిస్తితులమధ్య కొనసాగించలేకపోయాను. ఏ పేరు పెట్టానొ కూడా గుర్తుకు రావటం లేదు. 2007 లో ఈ బ్లాగు మొదలుపెట్టాను. ప్రతి రోజు యెదో రాద్దమని వస్తుంటాను. వచ్చి ఒక్కసారిగ గుభాళించె బ్లాగుల పరిమళాలు నింపుకొని వెళ్ళిపోతుంటాను.

Monday, December 31, 2007

బ్లాగుల్ని ఏరుకుంటూ...

1999-2001 మధ్య లో బ్లాగు క్రియేట్ చేసాను. విజిటర్స్ లేకపోవటం, నాతో పాటే అప్పుడప్పుడె కుదురుకుంటున్న ఈ రంగం లోని అనిశ్చిత పరిస్తితులమధ్య కొనసాగించలేకపోయాను. ఏ పేరు పెట్టానొ కూడా గుర్తుకు రావటం లేదు. 2007 లో ఈ బ్లాగు మొదలుపెట్టాను. ప్రతి రోజు యెదో రాద్దమని వస్తుంటాను. వచ్చి ఒక్కసారిగ గుభాళించె బ్లాగుల పరిమళాలు నింపుకొని వెళ్ళిపోతుంటాను.